News

కదిలిన ‘వందేభారత్’

564views

రికొన్నేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా జమ్ము-కశ్మీర్‌ అవతరిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. దిల్లీ-కాట్రాకు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, జితేంద్ర సింగ్‌, హర్షవర్ధన్ తదితరులు ఉన్నారు.కాట్రాలోని వైష్ణవిదేవి ఆలయాన్ని భక్తులు సందర్శించేలా ఈ రైలు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ ” జమ్మూ-కాశ్మీర్‌లో 370వ అధికరణలో మార్పుల తర్వాత అభివృద్ధిలో చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. వచ్చే పదేళ్లలో జమ్ము-కశ్మీర్‌ దేశంలోనే అత్యంత్య అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుంది. ఆ ప్రాంతంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తోనే అభివృద్ధికి పునాదులు పడతాయి” అని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.