News

రైలు పట్టాలపై అడ్డంకులు…యూపీలో తప్పిన ముప్పు

259views

రైలు పట్టాల మధ్య ఓ ఖాళీసిలిండర్, ఓ భారీ లోహపు వస్తువు ఉన్న వేర్వేరు ఘటనల్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో ఉత్తరప్రదేశ్ లో రెండు పెద్ద ప్రమా దాలు తప్పాయి. కాన్పుర్ లో ని బర్రాజ్పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్లాన్లో ఖాళీ ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లను భద్రత బృందం రోజువారీ గస్తీలో భాగంగా గమనించింది. ఒక గోనెసంచిలో దానిని చుట్టి ఉంచారు. ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఉంచారని ప్రాథమిక విచారణలో తేలింది. కాన్పుర్ నుంచి ఫోరెన్సిక్ బృందాలు వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించాయి. మరో ఘటనలో.. సహార నప్పుర్ జిల్లాలోని తాప్రీ సమీపంలో పట్టాలపై లోహపు వస్తువు అడ్డంగా ఉన్నట్లు మంగళవారం తెల్లవారుజామున సిబ్బంది చూశారు. వెంటనే రైళ్ల రాకపోకల్ని నిలుపుచేశారు.