
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో తెలుగింటి సంప్రదాయాలు ఉట్టిపడేలా కట్టుబొట్టుతో అమెరికాకు చెందిన భక్తులు ఆకట్టుకున్నారు. పెంచలకోన సమీపంలోని కరుణామయి ఆశ్రమ నిర్వాహకురాలు విజయేశ్వరీదేవితో పాటు 70 మంది విదేశీ భక్తులు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనార్థం వచ్చారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేపట్టారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. స్వామి వారిని దర్శించుకుని రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం రాహు కేతు పూజలు నిర్వహించారు. స్వామి వారితో పాటుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలను, శ్రీకాళహస్తి శివాలయం విశిష్టతను అమెరికా భక్తులు కొనియాడారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని అమెరికన్లు తెలిపారు.





