
మహా కుంభమేళాలో భక్తుల భద్రత దృష్ట్యా గంగా, యమునా నదుల్లో పెద్ద సంఖ్యలో “జల్ పోలీసుల” ను మోహరించారు. నదులలో భక్తులకు ప్రమాదం కలుగుకుండా భాద్యతలు నిర్వహించే ఈ సిబ్బందికి అండర్ వాటర్ డ్రోన్లు, సోనార్ సిస్టమ్స్ వంటి అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచారు. నదుల సంగంలోని ప్రతి అంగుళాన్ని జల పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల భద్రత కోసం జల్ పోలీసులు ఇప్పటివరకు 2 వేల 500 మంది సిబ్బందిని నియమించారు. మూడు జల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జల్ పోలీసుల కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పర్యవేక్షిస్తుండగా, మొత్తంగా 17 జల్ పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. జాతర ప్రారంభానికి ముందు ఈ సిబ్బందిని మరింత పెంచి, మరో 1,300 మంది జల్ పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. 8 కిలోమీటర్ల పరిధిలో నీటి లోతుల్లో బారికేడింగ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు రెస్క్యూ స్టేషన్లను ఏర్పాటు చేసి.. సిబ్బందిని మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో నాలుగు వాటర్ అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు.





