News

మణిపుర్‌ ప్రజలకు బీరెన్‌సింగ్‌ క్షమాపణలు

227views

మణిపుర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌సింగ్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నిరాశ్రయులైన పౌరుల కోసం విచారం వ్యక్తంచేసే హృదయపూర్వక చర్యగా తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను క్షమాపణ చెప్పిన అంశాన్నీ కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గత పాపాల ఫలితమే మణిపుర్‌ సంక్షోభమని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గతంలో చోటుచేసుకున్న ఘటనల్లో చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. దానికి నేను చింతిస్తూ.. క్షమాపణలు చెబుతున్నాను. అందరూ కలిసి శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన మూడు-నాలుగు నెలల నుంచి ఉన్న శాంతియుత వాతావరణాన్ని చూస్తుంటే రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.