
తన 18 ఏళ్ల సహాధ్యాయికి మత్తు ఇచ్చిఆమెపై లైంగికదాడికి పాల్పడిన మొహమ్మద్ జాసిం అనే 19 ఏళ్ల యువకుడిని కోజికోడ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రిస్టియన్ అయిన ఆ యువతి తండ్రి, నిందితుడు జస్సిం తన కుమార్తెను ఇస్లాం మతంలోకి మారమని బెదిరిస్తున్నాడని ఆరోపించడంతో వివాదం చెలరేగింది.
ఆ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు జులై 25న నగరంలోని సరోవరం బయోపార్క్ వద్ద జస్సిం తన కుమార్తెను కలుసుకొని, ఆమెకు మత్తు ఇచ్చి ఆమెపై లైంగికంగా దాడి చేసి, దానిని వీడియో తీయడమే కాకుండా ఆ వీడియో చూపి ఆమెను ఇస్లాం మతంలోకి మారవలసిందిగా బెదిరించాడు. తన కుమార్తె మాత్రమే కాక మరికొంత మంది బాలికలు కూడా జస్సిం వలలో చిక్కుకుని వుండే అవకాశం ఉందని కూడా ఆయన ఆరోపించారు.
ఈ కేసు విషయంలో ఆగస్టు5 వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ కోజికోడ్ పోలీసులకు తాఖీదులందాయి. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేగే వరకు ఆ వ్యక్తిని అరెస్టు చేయలేదు. దీంతో జస్సిం చివరకు లొంగిపోయాడు.
కోజికోడ్ పోలీస్ కమిషనర్ యువతీ తండ్రి చెప్తున్నట్టు ఇది ‘లవ్ జిహాద్’ కేసు కాదని అన్నారు. “ఇద్దరూ ఒకే విద్యా సంస్థలో చదువుకునేవారు. ఆమె ఆ యువకుడికి ఏడాది జూనియర్. వాళ్ళ మధ్య అనుబంధం ఉంది. ఆస్సిం తనకు తాగడానికి ఏదో ఇచ్చాడని ఆ బాలిక చెబుతోంది. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలు ఆమెకు లీలగా మాత్రమే గుర్తున్నాయి. అయితే ఆమె ఇస్లాం మతంలోకి మార్చబడలేదు. ఆమెను ఇస్లాంలోకి మారమని అతను బెదిరించాడా? లేదా? అన్న విషయాన్ని మేము లోతుగా పరిశీలిస్తున్నాం.” అని కమిషనర్ టిఎన్ఎంకు తెలిపారు.
ఇదిలా ఉండగా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎకె జమాలుధీన్ మీడియాతో మాట్లాడుతూ యువతి ఇస్లాం మతంలోకి మారితేనే తనను పెళ్లి చేసుకుంటానని జస్సిం పట్టుబట్టాడని తెలిపాడు.
కాగా యువతి తండ్రి ఈ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఈ ఇద్దరికీ అసలు సంబంధం లేదని మీడియాకు తెలిపారు. “అలా అయితే, ఆమె మత్తులోనే ఎందుకు, అక్కడి నుండి పరిగెడుతుంది?” అని అడిగాడు. ఇది ‘ సాధారణ బ్లాక్ మెయిలింగ్ కేసు ‘ కాదని జాతీయ మహిళా కమిషన్ కు ఆయన తెలిపారు.

ఇదిలాఉండగా, తొలిసారిగా కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (కేసీబీసీ) కి చెందిన సామాజిక సమరసతా పరిరక్షణ సమితి రాష్ట్రంలో క్రిస్టియన్ బాలికల బలవంతపు మత మార్పిడిపై సమగ్ర దర్యాప్తు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరింది.
కోజికోడ్ లైంగిక దాడి కేసును లోతుగా దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని కేబీసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్, అధికార ప్రతినిధి ఫాదర్ వర్ఘీస్ వల్లిక్కట్ ఆరోపించారు.
ఫాదర్ వల్లిక్కట్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “గతంలో ప్రేమ వివాహాల పేరుతో బలవంతపు మతమార్పిడులు చేయడానికి రాష్ట్రంలో కొన్ని రహస్య ముఠాలు పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా జరిగిన కోజికోడ్ ఘటనలో కూడా బలవంతపు మతమార్పిడి కోణం ఉన్నదేమో ప్రభుత్వం నిశితంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది.”
“బలవంతపు మత మార్పిడి వ్యవహారంపై వివరణాత్మక విచారణ నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారు. విచారణలో పురోగతి లేకపోవడం పోలీసు బలగాల విశ్వసనీయతపై సందేహం కలిగిస్తోంది. ఇటీవల జరిగిన సంఘటనలతో చర్చి వేదన చెందుతోంది. కొన్ని గ్రూపులు క్రిస్టియన్ బాలికలను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నాం ‘ అని ఆయన తెలిపారు.
‘ రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులపై ప్రభుత్వ దర్యాప్తును కోరుతున్నాం. అందరూ కలసి ఉండే సమాజంలో ప్రేమ వివాహం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ బలవంతపు మతమార్పిడులు సానుకూల సంకేతం కాదు. రాష్ట్రంలో క్రిస్టియన్ బాలికల బలవంతపు మత మార్పిడులపై చర్చి ఆందోళన చెందుతోంది ‘ ‘ అని సైరో మలబార్ చర్చికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కెసీబీసీకి చెందిన సామాజిక సమరసతా పరిరక్షణ సమితి బలవంతపు మతమార్పిడుల గురించి అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని చర్చి వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, కేరళలో ఇస్లామిక్ టెర్రరిస్టు నియామకాలు జరిపేవారికి క్రిస్టియన్ బాలికలు లక్ష్యం అవుతున్నారని పేర్కొంటూ జాతీయ మైనారిటీ కమిషన్ (ఎన్సీఎం) వైస్ చైర్ పర్సన్ జార్జ్ కురియన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకోవాలని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ద్వారా దర్యాప్తుకు ఆదేశించాలని, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావాలని కురియన్ తన లేఖలో కోరారు.
“కేసీబీసీ సమాచారం ప్రకారం 2006, 2009 మధ్యకాలంలో 2,600 మందికి పైగా క్రిస్టియన్ బాలికలు ఇస్లాం మతంలోకి మార్చబడ్డారు. ఇటీవల కేరళ నుంచి 21 మంది ఐ ఎస్ తీవ్రవాద సంస్థలో చేరినట్లుగా వార్తలు వచ్చాయి. వారిలో ఐదుగురు క్రైస్తవం నుంచి ఇస్లాంలోకి మార్చబడిన వారేనని కేసీబీసీ రిపోర్టులు తెలుపుతున్నాయి. కేసీబీసీ, చర్చికి సంబంధించిన ‘జాగరత’ అనే పత్రికలో 2005-2012 మధ్య కాలంలో సుమారుగా 4,000 మంది క్రైస్తవ బాలికలు మత మార్పిడులకు గురయ్యారని చూపారు” అని కురియన్ ఆ లేఖలో పేర్కొన్నారు.





