
190views
ముంబయి దాడుల్లో నిందితుడైన ఉగ్రవాది కసబ్ విషయంలో భారతదేశం ప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని.. కాని బంగ్లాదేశ్‌లో అరెస్టయిన చిన్మయ్ కృష్ణదాస్‌కు కనీసం న్యాయపరమైన అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని దేశంలో హిందువుల కోసం గొంతెత్తిన చిన్మయ్ కృష్ణదాస్‌పై దేశద్రోహం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయన విషయంలో పారదర్శక విచారణకు అవకాశం లేకుండా పోయింది. కృష్ణదాస్‌కు కనీస హక్కులు కల్పించాలి’ అని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో అందరూ స్పందించాలని పిలుపునిచ్చారు.





