News

హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

58views

హైందవ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గేదెలవానిపేటలో స్వయంభుగా వెలసిన ఉమామ హేశ్వర స్వామి పీఠం ప్రాంగణం లో కల్యాణ వెంకటేశ్వరుని ఆల య నిర్మాణానికి శుక్రవారం ఎమ్మె ల్యే గొండు శంకర్‌ శంకుస్థాపన చేశారు. ఆధ్యాత్మికతతో మెలిగే వారికి క్రమ శిక్షణ అలవడుతుందని, తద్వారా ప్రశాంత జీవనం పొందవచ్చునన్నారు. అనంతరం బంకుపల్లి రామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.