బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది.
బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరపున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని దాస్ పేర్కొన్నారు.
ఐసీయూలో ఉన్న రాయ్ ఫోటోను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి దాస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. న్యాయవాది రమణ్ రాయ్ కోసం ప్రార్థించాలని ఆయన హిందువులను కోరారు. ఇస్లామిక్ ఛాందసవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారని దాస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సమిత సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరును నిరాకరించి, జైలుకు తరలించింది.