“దేహానికి ఆత్మ ఎలాంటిదో – దేశానికి ధర్మం సైతం అలాంటిది. ఆత్మవినా దేహం ధర్మం వినా దేశం మృతప్రాయాలు, ఈ దేశ ధర్మానికి ప్రపంచంలోని ఏ ఇతర దేశ ధర్మాలకు పోలని ఒక విశిష్ట లక్షణ సంచయం ఉంది. అందువల్లనే మన ధర్మం విశ్వధర్మం కాదగింది.
ఒక జాతి ధర్మం, ఆ జాతి సంస్కృతి ఎంతటి సనాతనమనదే అయినా సమాజంలో నీ తద్ధర్మానోష్టానం నిత్యం జరుగుతున్నప్పుడే ఆ ధర్మం సజీవం, సచైతన్యం. మన ధర్మం ఈనాటిది కాదు. వేదాల ఉద్భవానికే ఒక కాలా న్నంటూ నిర్ణయించినా, మన ధర్మం అంతకన్న పురాతమైనదిగా పేర్కొన్నారు. ‘ఇతి ప్రాచీన యోగ్యోపాస్వా…’ అని వేదంలో ఒక వాక్యం ఉంది. వేదకాలంలోనే ఒక గురువు తన శిష్యునితో, ‘ఈ ప్రాచీన విద్యకు నీవు ఈ విధంగా యోగ్యుడవు’ అని అంతకు గూడా సనాతనమైన ఒక సంస్కృతి, విద్యను గురించి గురువు శిష్యునకు బోధించడం ఉంది. దీనినిబట్టి మన ధర్మం ఏనాడు రూపొందిందో నిర్ణయించటం కష్టం. అంతటి అతి సనాతన ధర్మం, ఇటీవలి ముస్లిం, బ్రిటీషు దండయాత్రలూ, తాకిడులను తట్టుకొని నిలబడగలిగింది. అలా మన ధర్మం నిలబడగలగటానికి గల ఏకైక కారణం అది నిత్య చైతన్యంతో మన సమాజంలో అనుష్ఠితమవుతూ ఉండటమే.
అయితే, ఇటీవల కొంతకాలంగా సమాజంలో ధర్మగ్లాని ఏర్పడింది. ఈ గ్లాని ఎంతదాకా దోవతీసిందంటే.. మన పరిసారలలోనే ధర్మనిష్ణాతుక చర్యలు జరుగుతున్నా మనకు పట్టని స్థితికి మనలను దిగజార్చింది. ప్రాణభూతమైన ధర్మం ఇలా విస్మరణపాలవుతూర నేటి సమాజం జీవచ్ఛవంలా తయారయింది. ఇది ఇలాగే కొనసాగితే – ఈ దేశం, ఈ ధర్మం ఒకనాటికి ఏమవుతుందో అన్న ఆదుర్దా ధర్మచింత గల కొద్దిమందిలో కలిగింది. ఒక వంక మన ధర్మవిస్మరణాన్ని ఆసరాగా తీసుకొని విమతశక్తులు విజృంభించి, మన దేశీయ జనసందోహాన్ని, తమ భౌతిక వైభావాది ప్రలోభాలకు బానిసలను చేసుకొంటు న్నాయి. మరోవంక దేశ ప్రభుత్వం ‘సెక్యులరిజం’ అంటూ స్వీయధర్మ విస్మరణానికీ, పరధర్మాచరణానికీ పూనుకోవడం కనిపిస్తుంది. ఈ ధర్మసంజాతు లయినవారే, ఈ అధునాతన ‘సెక్యులర్’ నినాదం మోజులోని పడి ఈ ధర్మజులం కాదని చెప్పుకొనే స్థితికి దిగజారటం కనిపిస్తోంది, సంస్కృతి దేశ లక్షణానికి వ్యక్తి వికాసానికీ సంకేతం. ఆధారభూతం మన సంస్కృతి. ప్రాచీనమూ, సనాతనమూ అయిన వైదిక సంస్కృతిని పరిరక్షించుకోవటం ఈ సంస్కృతీ భవులుగా మన కనీస విధి. మనకు ధర్మం వినా సంస్కృతి లేదు.
‘నేను హిందువును’ అని చెప్పుకోటానికి గర్వపడగలగాలి. ఆ స్థాయికి మనం చేరుకోగలిగిననాడు, ఆ స్థాయిలో మన మనోభావరీతి సాగ గలిగిననాడు మన ధర్మంపై ఎవరూ ఎలాంటి ఆఘాతాలను కలుగజేయలేరు. మన గీత మనకు కర్తవ్యం బోధిస్తుంది. మన హిందువులలో ప్రగాఢంగా పాదుకొనాలంటే నిత్య భగవద్గీతాధ్యయనం, ఆచరణాలు అవసరం. మన ధర్మ, విశ్వాసాలను మరొకరెవరూ తాకినా భరించలేని, సైపజాలని తీవ్ర అచంచల భక్తి ప్రపత్తులూ, శ్రద్ధాసక్తులు మనలో పాదుకొనిననాడు తప్ప మన హైందవ ధర్మం పూర్వ వైభవస్థితికి రాదు. అంతటి ఉచ్చస్థితికి, ఉత్తమోత్తమ వైభవస్థితికి ఈ మన ధర్మాన్ని కొనిపోగల శక్తియుక్తులు సాధించటం హిందువుడై పుట్టిన ప్రతివాని కనీస బాధ్యత. ఈ బాధ్యతను మనం మనసా, వాచా, కర్మణా భావించి, ఆచరించగలప్పుడే మన ధర్మం రక్షణ పొందతుంది. అప్పుడే మనలను మన ధర్మం గూడా రక్షిస్తుంది(‘ధర్మో రక్షతి రక్షితః’).
– స్వామి దయానంద సరస్వతి