
13views
హరిద్వార్ లోని సుమన్ నగర్ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదును ప్రభుత్వం కూల్చేసింది. నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రభుత్వ భూమిలో ఈ మసీదు అక్రమ నిర్మాణం జరిగింది. బుధవారం అధికార యంత్రాంగం భారీ బందోబస్తు నడుమ బుల్డోజర్ల సాయంతో మసీదును కూల్చేశారు.అక్రమ మసీదుల విషయంలో తమ ప్రభుత్వం సీరియస్ గా వుంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
‘‘రోషల్ అలీషా బాబా సమాధిగా’’ దీనిని పిలుచుకుంటారు. 10 నుంచి 15 మీటర్ల విస్తీర్ణంలో దీనిని ఆక్రమించి, నిర్మాణం చేశారని అధికారులు ప్రటకించారు. ఈ మసీదును చూసే వారికి నెల రోజుల క్రితమే తాము నోటీసులిచ్చామని, అయినా స్పందన లేదని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ నిర్మాణానికి సంబంధించిన పత్రాలను, హక్కు పత్రాలను తమకు చూపించాలని కూడా ఆదేశాలిచ్చామని, అయినా.., నిర్లక్ష్యంగానే వున్నారని, నిర్దేశిత గడువులోగా ఎలాంటి సరైన పత్రాలు సమర్పించలేదని అధికారులు వెల్లడించారు.
అయితే.. ఆ స్థలంలోని ఓ పెద్ద మేడిచెట్టు కింద కేవలం కొన్ని ఇటుకలు, నాణేలు లభించాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని పేర్కొన్నారు.





