బంగ్లాదేశ్ పేషెంట్లకు చికిత్స అందించకూడదని త్రిపుర హాస్పిటల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై హోటల్స్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. బంగ్లాదేశీ పౌరులకు హోటల్స్ లో రూములు ఇవ్వద్దని, లాడ్జీల్లో కూడా రూములు ఇవ్వొద్దని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. అంతేకాకుండా మీల్స్ కూడా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కూడా ప్రకటించాయి. ఇది రాష్ట్రమంతటా వర్తిస్తుందని వెల్లడించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇస్కాన్ స్వామీజీని కూడా అరెస్ట్ చేశారని, దీనికి నిరసనగానే ఈ నిర్ణయమని హోటల్స్ యాజమన్యాలు ప్రకటించాయి.
బంగ్లాదేశీయులు హోటల్స్ లోకి రావొద్దని బయట పోస్టర్లు కూడా పెడుతున్నారు. అలాగే హోటల్స్ రిసెప్షన్ల వద్ద కూడా వీటిని వుంచుతున్నామని హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు తాము ప్రతిజ్ఞ కూడా చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని హోటల్స్ పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని లాడ్జీలు, హోటళ్లు ఈ పోస్టర్లను హోటల్స్ బయట అతికించారు కూడా.