News

బంగ్లాదేశ్ హింసని నిరసిస్తూ వైట్ హౌజ్ ముందు హిందువుల నిరసన

241views

బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించండి’’ అంటూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ముందు హిందువులు నిరసన వ్యక్తం చేసింది. భారతీయ డయాస్పోరా సభ్యులతో పాటు వివిధ ప్రాంతాల హిందువులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లోని హిందువులపై అక్కడి ప్రభుత్వం అనేక దురాగతాలు చేస్తోందని, దీనిని వెంటనే నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హిందువులను రక్షించాలి… సేవ్ హిందూస్ అంటూ పోస్టర్లు, బ్యానర్లతో నిరసనకు దిగారు. బంగ్లాదేశ్ లో రోజురోజుకీ హిందువులపై దాడులు జరుగుతున్నాయని, దేవాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయని నిరసనకారులు మండిపడ్డారు. వీటి విషయంలో ప్రపంచ దేశాలు వెంటనే జోక్యం చేసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

మరోవైపు కెనడాలోనూ హిందువులు నిరసనలు చేశారు. మాంట్రియల్ లో చిన్మయ్ దాస్ అరెస్ట్ ను హిందువులు ఖండించారు. బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా నిరసనను నిర్వహించారు. మైనారిటీ హక్కులు కాపాడేలా ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ పై ఒత్తిడి తేవాలని వారందరూ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని నినాదాలిచ్చారు. హిందువులపై జరుగుతున్న హింసను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు.