News

ఇస్కాన్ చిన్మోయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ పోలీసులు

300views

ఇస్కాన్‌కు చెందిన చిన్మోయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ దిగగానే ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దీనిపై కృష్ణదాస్‌పై కేసు నమోదైంది.

చిన్మోయ్ కృష్ణదాస్‌ అరెస్టుపై ఇస్కాన్ ప్రతినిధులు భారత ప్రభుత్వానికి తెలియజేశారు. విడిపించాలని కోరారు. భారత విదేశాంగ శాఖ అధికారులు కూడా కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించారు.ఎంబసీ అధికారులు ఈ విషయంపై బంగ్లాదేశ్ అధికారులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తుందని, ఎలాంటి హింసను ప్రోత్సహించదని ఆ సంస్థ ప్రతినిధులు బంగ్లాదేశ్ పోలీసులకు తెలియజేయాలంటూ విదేశాంగశాఖ అధికారులు సూచించారు. కృష్ణదాస్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.