News

శబరిమలై యాత్రకు ప్రత్యేక రైళ్లు

295views

శబరిమలై యాత్రకు శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సందీప్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్‌ 08553 శ్రీకాకుళం రోడ్డు–కొల్లాం స్పెషల్‌ ట్రైన్‌ ప్రతి ఆదివారం డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు నడుస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08554 స్పెషల్‌ ట్రైన్‌ కొల్లాం– శ్రీకాకుళం రోడ్డు వరకు డిసెంబర్‌ 2 నుంచి జనవరి 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామని పేర్కొన్నారు. పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట నుంచి కొల్లాం వరకూ ప్రధాన కూడళ్లలో స్పెషల్‌ ట్రైన్‌ ఆగుతుందన్నారు. రైలు నంబర్‌ 0539 విశాఖ–కొల్లాం స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ డిసెంబర్‌ 4 నుంచి ఫిబ్రవరి 26 వరకు బుధవారాల్లో నడుస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్‌ 08540 కొల్లాం–విశాఖ వీక్లీ స్పెషల్‌ డిసెంబర్‌ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు శుక్రవారాల్లో నడుస్తాయన్నారు. అయ్యప్పభక్తులు రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.