News

రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా రూ.75 వెండినాణెం

384views

భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా రూ.75 వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌తో రూపొందిస్తున్నట్లు పేర్కొంది. నాణెంపైన, కింద 75వ రాజ్యాంగ వసంతోత్సవం అని దేవనాగరి లిపి, ఇంగ్లిష్‌ల్లో ముద్రిస్తారు. అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1949, కుడివైపున 75వ వసంతోత్సవం జరుపుకొనే 2024 సంవత్సరం ముద్రించి ఉంటాయి.