
341views
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఘాట్ రోడ్డులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదని ఆలయ ఈవో కెఎస్.రామరావు తెలిపారు. ఘాట్ రోడ్డులో కొండ రాళ్లు జారిపడ కుండా రక్షణ చర్యల్లో భాగంగా పనులు జరుగుతున్నాయి. పనులు వేగవంతంగా చేపట్టేందుకు మూడు రోజుల పాటు ఘాట్ రోడ్డులో రాకపోకలను పూర్తిని నిలిపివేస్తామని అధికారులు పేర్కొన్నారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఘాట్ రోడ్డు మీదగా సాధారణ భక్తులతో పాటు వీఐపీలను అనుమతించబోమని స్పష్టం చేశారు. భక్తులందరూ కనకదు ర్గనగర్, మహా మండపం మీదగా లిప్టు, మెట్ల మార్గం ద్వారా అమ్మవారి ఆలయ ప్రాంగ ^ ణానికి చేరుకుని క్యూలైన్లలో దర్శనానికి ఆ వెళ్లాలని సూచించారు.





