
డిసెంబర్ 1వ తేదీ నుంచి జరిగే మండల హిందూ సమ్మేళనాలను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ -ఆర్‌ఎస్‌ఎస్ సంఘ ప్రచారక్ సురేందర్ పిలుపునిచ్చారు. కర్నూలులోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని విశ్వ హిందూ పరిషత్ -వీహెచ్‌పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు జిల్లాల్లోని రెవెన్యూ మండలాల్లో కన్వీనర్, కో–కన్వీనర్, రవాణా, మీడియా, సోషల్ మీడియా, ప్రచార సామగ్రి ప్రముఖులను నియమించుకొని ఆయా విభాగాల పనిని సమన్వయం చేయాలన్నారు. రాబోయే రోజుల్లో విస్తృతంగా పంచాయతీ గ్రామాల సమావేశాలు నిర్వహించాలన్నారు. రవాణా కన్వీనర్‌గా భానుప్రకాష్, కో–కన్వీనర్‌గా ఈపూరి నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్‌గా గిరిబాబు, కో–కన్వీనర్‌గా శ్రీధర్, ప్రచార సామగ్రి కన్వీనర్‌గా గోవిందరాజును నియమించారు. వివిధ విభాగాల కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు.





