
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో చోళుల కాలం ( 16వ శతాబ్దం) నాటి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దేవదాయశాఖ అధికారులు ప్రతిష్టించారు. శుద్ధ ఏకాదశి రోజున పంచలోహా విగ్రహాలకే శివపార్వతుల కల్యాణం జరిపించాలని ఆలయ కమిటీ వారు పట్టుబట్టారు. దీంతో సబ్‌ట్రెజరీలో భద్రపరిచిన ఈ విగ్రహాలను ఈ నెల 11వ తేదీన ఎండోమెంట్ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ తీసుకొని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. ఏకాదశి సందర్భంగా ఈ పంచలోహ విగ్రహాలకే శివపార్వతుల కల్యాణం జరిపించారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఆలయంలోని అతి పురాతనమైన ఈ పంచలోహ విగ్రహాలు 1990లో చోరీ అయ్యాయి. తాళ్లరేవు ప్రాంతంలో పోలీసులు వీటిని రికవరీ చేశారు. అప్పటి నుంచి విగ్రహాలను ట్రెజరీలో భద్రపరిచారు. కమిటీ వారి అభ్యర్థన మేరకు ఆలయ అధికారులు విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చారు.





