
395views
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఏ విభాగంలోనూ అన్యమతస్థుల సేవలు అక్కర్లేదని టిటిడి బోర్డు నూతన సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆ ఉద్యోగులు ఇతర శాఖలకు మారిపోవడమో, లేదంటే ఉద్యోగాలు వదిలేయడమో ఎంచుకోవాలని సూచించారు. విజయవాడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘హిందూయేతరులు టిటిడిలో ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో గుర్తించాం. వీరి విషయమై ఈ నెల 18 జరిగే కొత్త పాలకమండలి తొలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేసినా, పార్టీ చిహ్నాలు ప్రదర్శించినా, కొండ దిగేలోగా వారిని అరెస్టు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు





