News

చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు

301views

కృష్ణాజిల్లా మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు, లాంచనంగా ప్రారంభించారు.కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పాండురంగ స్వామి కు పట్టు వస్త్రాలు మంత్రి సమర్పించారు. ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు వేదమంత్రాలు మధ్య ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి రవీంద్ర మాట్లాడుతూ,పాండురంగడి ఉత్సవాలు, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని,స్వయంభుగా వెలసిన స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు తరలి రానున్నారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 14వ తేదీ పాండురంగ స్వామి రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.