
చెన్నై పొన్నేరి సమీపం తిరేవేంగిడపురం గ్రామంలో కృష్ణన్ మారియమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వినాయకుడు, ఆంజనేయుడు, దుర్గ, షణ్ముగ, కౌమారి, వైష్ణవి, మహేశ్వరి తదితర దేవతామూర్తులకు ప్రత్యేక సన్నిధులు నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగే పూజలకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆలయం సమీపంలోని రోడ్డును పునరుద్ధరించే ప్రతిసారి రోడ్డు ఎత్తు పెరుగుతోంది. దీంతో, ఆలయం రోడ్డు కంటే కిందకు వెళ్లింది.
ప్రస్తుతం పొన్నేరి పరిసర ప్రాంతాల్లో జాకీలతో సాయంతో ‘లిఫ్టింగ్’ విధానంలో భవనాల ఎత్తు పెంచే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఈ లిఫ్టింగ్ విధానంలో ఆలయం ఎత్తు పెంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఓ సంస్థ సాయం తో జాకీలు ఏర్పాటుచేసి క్రమక్రమంగా లిఫ్టింట్ చేశారు. 20 రోజుల లిఫ్టింగ్‌లో ఆలయం మూడడుగుల ఎత్తు లేపారు. మరో రెండు నెలలో ఆలయంలో జీర్ణోద్ధరణ చేపట్టి కుంభాభిషేకం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు ఆర్‌ఎన్ బాలాజి సర్కార్ తెలిపారు.





