
188views
అయోధ్యలో రామ మందిరంపై భాగంలో నిర్మాణంలో ఉన్న కోదండ రామాలయంలో స్వామికి అలంకరించనున్న ధనుస్సు, బాణాలను భీమవరం పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దన స్వామి, మావుళ్లమ్మ ఆలయాల్లో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. వీటిని అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి (హైదరాబాద్) ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ పవిత్ర కార్తికమాసంలో పంచారామక్షేత్రాల్లో ఈ ధనుస్సుకు పూజలు చేయించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన విశ్రాంత ఎస్‌బీఐ అధికారి పురిఘళ్ల వెంకటరమణమూర్తి దంపతుల పర్యవేక్షణలో వీటిని ఆలయానికి చేర్చినట్లు తెలిపారు. భక్తులు సమకూర్చిన 13 కిలోల వెండి, కిలో బంగారంతో ధనుస్సు, బాణాలను తయారు చేయించినట్లు తెలిపారు.





