News

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

253views

కార్తిక మాసంలో భక్తులు ఒకే రోజులో అయిదు పంచారామాలను దర్శించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ-ఎన్టీఆర్ జిల్లా కల్పించింది. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాల కొల్లులోని క్షీరారామం, ద్రాక్షా రామంలోని ద్రాక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి వార్లను దర్శించుకునే సదుపాయం కల్పించారు.

ప్రతి శని, ఆది, సోమవారాల్లో…
కార్తిక మాసంలో ప్రతి శని, ఆది, సోమవారాలతో పాటు ముఖ్యమైన పర్వదినాలలో ఈ బస్సులు నడుపుతారు.విజయవాడ ఆటోనగర్ టెర్మినల్ ఉదయం 3 గంటలకు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (ఎరైవల్ బ్లాక్)లో ఉదయం 4 గంటలకు బయలుదేరే ఈ ప్రత్యేక బస్సులు అదే రోజు రాత్రికి తిరిగి విజయవాడ చేరుకుంటాయి.

చార్జీలు ఇలా..
సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్ బస్సులలో ప్రతి ప్రయాణికునికి చార్జి రూ.1120, రూ.1070గా నిర్ణయించారు. 35 మంది భక్తులు బృందంగా వస్తే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారి ఇంటి నుంచే నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

టికెట్ బుకింగ్ ఇలా..
ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్.ఇన్ వెబ్సైట్ ద్వారా గాని సమీప బస్ స్టేషన్లోగా ని, ఆర్టీసీ ఆథరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్లను గాని సంప్రదించి టికెట్లు పొందవచ్చు.

త్రిలింగ దర్శనానికి…
యాగంటి, మహానంది, శ్రీశైలంలలో త్రిలింగ దర్శనం చేసుకునే యాత్రి కుల కోసం ప్రతి కార్తీక శనివారం రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరి సోమవారం ఉదయం విజయవాడకు చేరుకుం టాయి. చార్జీ రూ.1,800 మాత్రమే.