
220views
వారాంతాల్లో శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్టు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టిందని పేర్కొంది. గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్టు తెలిపింది. భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని, నారాయణగిరి షెడ్ల వద్ద ఇటీవలే ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ తో భక్తులు క్యూలో వేచి ఉండే సమయం తగ్గిందని వివరించింది. క్యూల్లోని భక్తులకు అల్పాహారం, పాలు, నీరు 24 గంటలు పంపిణీ చేసినట్లు తెలిపింది.





