News

కెనడాలో దేవాలయంపై దాడి : హిందువుల భారీ నిరసన ర్యాలీ

74views

కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూసభ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ అనుకూల శక్తుల దాడులను నిరసిస్తూ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ఫోబియాను వీడాలంటూ నిరసనలు తెలిపారు. హిందూ సభ దేవాలయంపై దాడిని ప్రధాని మోదీ ఖండించారు. కెనడా ఇలాంటి దాడులను నిలువరిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలంలో కెనడాలో హిందూ దేవాలయాలు, హిందూ భక్తులను లక్ష్యంగా చేసుకుని ఖలిస్థాన్ అనుకూల అరాచకవాదులు రెచ్చిపోతున్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత ఇలాంటి ఘటనలు మరింత పెరిగాయి. తాజాగా ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. నవంబరులో ఎయిర్ ఇండియా విమానాలు ఎవరూ ఎక్కవద్దని, ఖలిస్థాన్ ఉగ్రవాదులు వాటిని పేల్చివేసే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశాడు.

హిందూ దేవాలయంలపై దాడులను కెనడాలోని భారత హై కమిషనర్ ఖండించారు. ఇలాంటి దాడులు తప్పుడు సంకేతాలను పంపుతాయన్నారు. కెనడా పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. వేర్పాటు వాదులను ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.