News

తమ దేశ చరిత్రపై హిందుత్వ ప్రభావం; చైనా పండితుల వెల్లడి

158views

చైనాలోని పలు బౌద్ధ గ్రంథాల్లో రామాయణ కథల ఆనవాళ్లు ఉన్నాయని చైనాకు చెందిన పండితులు పేర్కొన్నారు. తమ దేశ చరిత్రపై హిందుత్వ ప్రభావాన్ని తొలిసారి వెలుగులోకి తెచ్చారు. భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ‘రామాయణ-ఏ టైమ్స్ గైడ్’ సదస్సులో పలువురు చైనా పండితులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో రామాయణం చైనాలోకి ఎలా వచ్చింది, చైనా కళలు.. సాహిత్యంపై ఎటువంటి ప్రభావం చూపించిందన్న అంశాలను వివరించారు. మతపరమైన, లౌకిక ప్రపంచంపై రామాయణ ప్రభావం ఎంతో ఉందని ప్రొఫెసర్, డాక్టర్ జియాంగ్ జింగ్కుయి పేర్కొన్నారు. చైనా కూడా ఆ ఇతిహాసంలో అంశాలను తన సంస్కృతిలో మిళితం చేసేసుకుందన్నారు.