పల్నాటి వీరారాధన ఉత్సవాలు నవంబరు 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఒక ప్రకటనలో తెలిపారు. కార్తిక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు పల్నాటి వీరుల ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మొదటి రోజు శనివారం రాచగావు, డిసెంబరు 1వ తేదీ రాయబారం, 2వ తేదీ మందపోరు, 3వ తేదీ కోడిపోరు, 4వ తేదీ బుధవారం కళ్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయని పీఠాధిపతి పేర్కొన్నారు. మందపోరు చారిత్రక ఘట్టాన్ని స్మరిస్తూ సాగే ఉత్సవం నాడు డిసెంబరు 2వ తేదీ సోమవారం బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం కులమతాలకతీతంగా పెద్దల సమక్షంలో అది అమలు జరుగుతుందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలలో స్ధిరపడిన వీరాచారులు, వీర విద్యావంతులు ఉత్సవాలకు తరలిరావాలని పీఠాధిపతి పిలుపునిచ్చారు. కార్తిక పౌర్ణమి నాడు ఈ నెల 15వ తేదీ పోతురాజుకు పడిగెం కట్టే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత నుంచి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి పెడతామన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరారు.
71
You Might Also Like
మైనారిటీలపై దాడులను ఖండిస్తూ బంగ్లా ప్రధానికి లేఖ రాసిన భారత ముస్లింలు
3
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత సమాజానికి చెందిన పలువురు ముస్లింలు తీవ్రంగా ఖండించారు. సత్వరమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించారు. ఈ...
హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ప్రదర్శన
4
బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులను అరికట్టాలని హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలు లో భారీ ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్ దేశంలో మైనారీలపై కొంత కాలంగా...
మసూద్ అజార్‌పై పాక్ ద్వంద వైఖరి : భారత్
6
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఆచూకీ దొరికింది. ఇటీవల పాకిస్థాన్‌లో బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన పలు వీడియోలు వెలుగులోకి...
సుబ్రహ్మణ్య షష్ఠి
డిసెంబర్ 07-సుబ్రహ్మణ్య షష్టి ‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే...
ప్రోబా-3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
5
విదేశీ ఉపగ్రహాలను సురక్షితంగా కక్ష్యలోకి చేరుస్తూ.. అంతర్జాతీయ మార్కెట్లో తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్న ఇస్రో ఖాతాలో మరో ఘన విజయం వచ్చి చేరింది. తన విజయాశ్వం...
బోర్డర్లో బంగ్లాదేశ్ కవ్వింపు
4
సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో అత్యాధునిక బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మొహరించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత్ సరిహద్దులో నిఘా పెంచింది....