News

తారను మాయం చేయనున్న జాబిల్లి

69views

అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్‌ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది.

భూమి నుంచి 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైకా నీలం, తెలుపు కాంతులతో వెలిగిపోతూంటుంది. భూమి నుంచి నేరుగా చూడగలిగిన అతి పెద్ద నక్షత్రాల్లో ఇదొకటి. అంతరిక్ష వింతలపై ఆసక్తి ఉన్నవారిని నవంబర్‌ నెలలో మరో మూడు ఘట్టాలు ఊరిస్తున్నాయి. బృహస్పతి, శని, అంగారక గ్రహాలు రాత్రిపూట ఎంచక్కా దర్శనమివ్వనున్నాయి. అవి భూమికి సమీపంగా వస్తాయని టెలిస్కోపు లేకున్నా బైనాక్యులర్లతో వాటిని స్పష్టంగా చూడొచ్చని నాసా పరిశోధకులు తెలిపారు.