
ముస్లింల ఆగడాలు భరించలేక హిందూ కుటుంబం వలస వెళ్లిపోయింది. వలస వెళ్తున్నామని ఆ ఇంటికి పోస్టర్ ను కూడా అతికించింది. ఈ ఘటన యూపీలోని ఖుషీనగర్ లో జరిగింది. ముస్లిం కుటుంబం నిత్యం తమ ఇంటి ముందే చెత్త పారబోస్తుంటారని, ఇదేమి అడిగితే తీవ్రమైన బెదిరింపులకు దిగుతున్నారని సచ్చిదానంద్ పాండే కుటుంబం వాపోయింది. పోలీసులు మాత్రం ఇది డ్రైనేజీ గొడవ అని లైట్ గా తీసుకుంది. ఈ పోస్టర్ లో ‘‘ముస్లింల అఘాయిత్యాలకు బాధపడుతున్నా. నేను నా ఆస్తులన్నీ అమ్మి వెళ్లిపోతున్నా’’ అని రాశారు. అదే పోస్టర్ లో ‘‘పలాయన్’’ అని రాసి, మొబైల్ నెంబర్లు కూడా రాశారు. ఈ బ్యానర్ ని ఇంటికి కట్టి, దాని ముందు కుటుంబం మొత్తం నిలబడి న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గ్రామంలో వుండే ప్రధాన అధికారి జైనుద్దీన్ అన్సారీ రోజూ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని హిందూ కుటుంబం పేర్కొంది. తమ కాలనీలో వుండే ఇరుగు పొరుగు ముస్లింలందరూ ఉద్దేశపూర్వకంగానే తమ ఇంటి ముందే చెత్త పారబోస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై చాలా సార్లు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని, అయినా వారు పట్టించుకోలేదని సచ్చిదానంద్ వాపోయారు. తాను చాలా అలసిపోయానని, దీంతో గ్రామం విడిచి వెళ్లిపోతున్నానని ప్రకటించారు. అందుకే పోస్టర్ కూడా పెట్టానని తెలిపారు.మరోవైపు పోస్టర్ వైరల్ గా మారడంతో ఖుషీనగర్ పరిపాలనా అధికారులు దృష్టి సారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది డ్రైనేజీ సమస్య అని పేర్కొన్నారు. దీనిని స్థానిక హిందువులు తప్పుబడుతున్నారు. వలస వెళ్లాల్సినంత అవసరం లేదని పైగా ప్రకటనలు చేస్తున్నారు.



