News

ఒక్క క్లిక్‌తో ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ్-2025 వివరాలు..

344views

12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్-2025 నిర్వహిస్తున్నారు. భారతదేశంతోపాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహాకుంభా మేళాకు తరలివస్తారు. మహాకుంభ్ 2025 తేదీలు, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవడానికి అధికారిక యాప్‌ అందుబాటులోకి తెచ్చారు.

మహాకుంభ్ 2025 కు సంబంధించి అన్ని రకాల సమాచారాన్ని, ఈ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడానికి ఏర్పాట్లు చేశారు.ఈ యాప్ పేరు ‘మహా కుంభమేళా 2025 యాప్’ దీన్ని Google Play Store నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఈ యాప్ ద్వారా ప్రజలు మహాకుంభ మేళాకు సంబంధించిన అన్ని రకాల పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

అలాగే మహాకుంభ మేళాపై వ్రాసిన పుస్తకాలు, బ్లాగుల ద్వారా మహాకుంభ సంప్రదాయాలు, దాని ప్రాముఖ్యత గురించి సమాచారం ఈ యాప్ లో అందుబాటులోకి తెచ్చారు. ప్రయాగ్‌రాజ్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు.ప్రపంచవ్యాప్తంగా వార్షిక మాఘమేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు ప్రసిద్ధి. యునెస్కో కూడా కుంభమేళాను ఒక అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చేర్చింది.