News

శతాబ్దాల నాటి శాపం.. దీపావళికి ఆ ఊరు దూరం!

288views

పూజలు, నోములు, వ్రతాలు, దీపాలు, బాణసంచా పేలుళ్లతో యావత్‌ దేశం ఘనంగా దీపావళి చేసుకుంది. చీకటిని పారదోలి వెలుగులు నింపే ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ ఊరు మాత్రం ఈ పర్వదినానికి దూరంగా ఉంది. గతంలో సతీసహగమనానికి గురైన ఓ మహిళ శాపం కారణంగా దీపావళిని జరుపుకోకూడదనే ఆచారాన్ని కొనసాగిస్తోంది.

స్థానిక కథనాల ప్రకారం.. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ దీపావళి పండగ కోసం పుట్టింటికి బయలుదేరింది. ఆలోపు రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చింది. అప్పటికే గర్భిణిగా ఉన్న ఆమె ఈ వార్తతో షాక్‌కు గురయ్యింది. ఆ బాధను భరించలేక.. భర్త చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఊరి ప్రజలు ఎన్నడూ దీపావళి చేసుకోవద్దని శాపం పెట్టిందట. దాంతో అప్పటి నుంచి ఆ ఊరిలో పండగను నిర్వహించడం లేదు.