
328views
కర్నూలు జిల్లా, గోనెగండ్లలో ఈ నెల 26న పశువులపై కత్తితో దాడి చేసిన నిందితుడు బండమీద షేక్ మదీనాను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తమ పశువులను కత్తితో దాడి చేశారని పెద్దమర్రివీడు లక్ష్మీనారాయణ, బోయ లక్ష్మీనారాయణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గ్రామంలో 16 పశువులపై కత్తితో దాడి చేసినట్లు వారు పేర్కొ న్నారు. నిందితుడు తప్పును ఒప్పుకొన్నాడని తెలిపారు. షేక్ మదీనాను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై తిమ్మా రెడ్డి, వంశీకృష్ణ, రవి పాల్గొన్నారు.





