
సీపీఎం అనుబంధ విద్యార్థి విభాగం SFI తన గుండాయిజాన్ని తరుచూ ప్రదర్శిస్తూనే వుంది. జాతీయవాద భావజాలం వున్న విద్యార్థులను టార్గెట్ గా చేసుకుంటూ రెచ్చిపోతోంది. విద్యార్థులను ఏకం చేయడం, వారిని జాతీయ వాదులుగా తీర్చిదిద్దే పనులను అడ్డుకోవడం, కాలేజీ విద్యార్థి ఎన్నికల్లో పాల్గొనకుండా బెదిరింపులకు దిగడం చేస్తూనే వుంది. తాజాగా ఎస్ఎఫ్ఐ గుండాగిరి మరోసారి బయటపడింది. తాజాగా కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పందళంలోని NSS కాలేజీలో బయటపడింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏబీవీపీ వారిని టార్గెట్ చేస్తూ… దూషిస్తూ దుర్భాషలాడారు. అలాగే ఏబీవీపీ నాయకులపై భౌతిక దాడులకు దిగారు.దీంతో ఏబీవీపీ పందళం పోలీస్ స్టేషన్ లో ఎస్ఎఫ్ఐ పై ఫిర్యాదు చేసింది.
అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ పై కూడా ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. ఓ కాలేజీ ప్రిన్సిపాల్ గా వుంటూ పక్షపాత ధోరణితో వుంటున్నారని, కమ్యూనిస్టు విద్యార్థి విద్యార్థం ఎస్ఎఫ్ఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఏబీవీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.ఎస్ఎఫ్ఐకి భజన చేయడం, వారి పంచన చేరడం ప్రిన్సిపాల్ మానుకోవాలని ఏబీవీపీ హితవు పలికింది. ఏబీవీపీ మహిళా సభ్యులపై ఎస్ఎఫ్ఐ దాడి చేసిందని, అలాంటి ఎస్ఎఫ్ఐని ప్రిన్సిపాల్ రక్షించాలని అనుకుంటున్నారని ఏబీవీపీ ఆరోపించింది. దీనిని నిరిసిస్తూ ఏబీవీపీ పందళనం నగర కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది.
ఈ విషయంలో ప్రిన్సిపాల్ తీరు బాగోలేదని, ఆయన పక్షపాత వైఖరితో వున్నారిన ఏబీపీ నాయకుడు అరుణ్ మోహన్ మండిపడ్డారు. ఇది అత్యంత అవమానకరమని, ఎస్ఎఫ్ఐ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన చేస్తూనే వుంటామని ఏబీవీపీ పతనంతిట్ట బాధ్యుడు అశ్విన్ ప్రకటించారు. అలాగే దాడికి గురైన వారు, వారి తల్లిదండ్రులు జాతీయ మహిళా కమిషన్ కి, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ లో ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
అయితే… ఇలా భౌతిక దాడులకు దిగడం, బెదిరింపు ధోరణులు ఇదేమీ కొత్తకాదు. ఎస్ఎఫ్ఐ తరుచుగా దౌర్జన్యాలు చేస్తూనే వుంటుంది. అయితే సీపీఎం రాజకీయంగా బలంగా వున్న ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ మరింత రెచ్చిపోతుంది. ఇలాంటి సంఘటనలు అధిక సంఖ్యలో వెలుగులోకి వస్తాయి. ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనేత పినరయి విజయన్ నేతృత్వంలో హోం మంత్రిత్వ శాఖ నడుస్తోంది కాబట్టి, పోలీసులు కూడా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.





