News

మన్ కీ బాత్ లో చేర్యాల్ చిత్రకళ గురించి ప్రధాని ప్రస్తావన

244views

దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన అసాధారణ వ్యక్తులు చాలా మందిని ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన డి.వైకుంఠం “చేర్యాల్” జానపద చిత్ర కళకు చేస్తున్న సేవను గురించి ప్రస్తావించారు.వైకుంఠం దాదాపు 50 సంవత్సరాలుగా చేర్యాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారని, తెలంగాణకు సంబంధించిన ఈ కళను ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన కృషి అద్భుతమని కొనియాడారు.

చేర్యాల్ పెయింటింగ్స్ సిద్ధం చేసే విధానం చాలా ప్రత్యేకమైందని . ఇది స్క్రోల్ రూపంలో కథలను ముందుకు తెస్తుందని తెలిపారు. ఇందులో మన చరిత్ర, పురాణాల పూర్తి సంగ్రహావలోకనం లభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.