
మహారాష్ట్రలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే అక్రమంగా దర్గా నిర్మితమైంది. 2025 నాటి నుంచి ఇది పనిచేయబోతోంది.పన్వేల్ లోని పర్గావ్ గ్రామం కొండపై ఈ దర్గాను నిర్మించారు. దీంతో ల్యాండ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చినట్లైంది. ఈ కొండపై నుంచి రన్ వే స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. ఇంతటి కీలకమైన, ప్రధానమైన స్థలంలో స్థలం ఆక్రమించుకొని, దర్గా నిర్మితమైనా… అధికారులు మాత్రం స్పందించలేదు. హిందూ ఐటీ సెల్ ఈ విషయాన్ని హోంశాఖ ముందు వుంచింది. ఈ మెరకు మెయిల్ చేసింది.
తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని, ఇది భద్రతాపరమైన అంశం కిందికి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 15 సంవత్సరాల క్రితమే ఈ భూమిని ఆక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎకరం భూమిలో ఐదు నుంచి ఆరు గదులు, షెడ్ కట్టి, పైకప్పులు వున్నాయి. తాము ముంబై పోలీసులకు కూడా తెలియజేశామని, అయినా చర్యలు శూన్యమని హిందూ ఐటీ సెల్ పేర్కొంది.విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్న రాష్ట్ర సిడ్కో, అక్రమ దర్గాను తొలగించాలని నోటీసులు అందజేసినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వార్తాపత్రికలు కూడా పేర్కొన్నాయి.
దర్గా ఆక్రమణకు సంబంధించిన వీడియోను పాత్రికేయుడు ప్రణవ్ జాదవ్ షేర్ చేశారు. ఈ దర్గా నుంచి నిలబడి వీక్షిస్తే మొత్తం రన్ వే, ఓడరేవు హైవే స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆధారాలతో సహా వివరించారు. అలాగే తన వీడియోలో ఈ దర్గాతో భద్రత ఎంత ముప్పులో పడిపోయిందో వివరించారు. అలాగే బారికేడ్లను కూడా నిర్మించారని, ఓ పరిధి దాటి వెళ్లకుండా కూడా దర్గా అధికారులు నియంత్రిస్తున్నారు.2011 లో ఈ ప్రాంతంలో ఏమి లేదు. తెల్లని రాయి మాత్రమే వుంది. 2011 కి ముందే దర్గా వుందని వాదనకు దిగుతున్నారు.
సుమారు 14 ఏళ్ల కిందట, అంటే 2011లో కాలిబాటగా వున్న ఈ ప్రాంతంలో 2012 నాటికి కచ్చారోడ్డు వేసి, బావిని కూడా తవ్వేశారు. దర్గా నిర్మాణం కూడా ప్రారంభమైంది. 2013 నాటికి ఓ ఫౌంటేన్, కూర్చునే ప్రదేశం నిర్మాణం చేశారు.జనవరి 2014 నాటికి దర్గా అని తెలిసేలా ఓ నిర్మాణం లాగా వచ్చింది. ఇక… 2024 నాటికి మాత్రం దర్గా అని తెలిసేలా పూర్తి నిర్మాణానికి వచ్చేసింది. దీనిని బట్టి చూస్తే… ఓ పథకం ప్రకారం మెల్లమెల్లగా కావాలనే దర్గాను నిర్మించినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది.
అయితే గత యేడాదిలో హిందూ జనజాగృతి సమితి ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో వున్న సిడ్కో భూమిలో అక్రమ దర్గాపై చర్య తీసుకోవాలని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో)కి లేఖ రాశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ అక్రమ దర్గా వుందని, దీంతో జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంది.ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని మెల్లమెల్లగా స్వాధీనం చేసుకుని దర్గాగా మార్చేశారనడానికి ఇదే సరైన ఉదాహరణ. ఇలాంటి నిర్మాణాల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా వుండాలి.





