News

వారణాసిలో శివ కేశవుల కోసం ప్రత్యేక కార్యక్రమం

331views

శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో “కాశీలో కార్తీకం” పేరుతో విశాఖ శారదా పీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నవంబర్ 3 – 5 తేదీల్లో సనాతన కుంజ్ జరుగుతుందని పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రామభద్రాచార్యతో సహా అనేక మంది ప్రఖ్యాత స్వామీజీలు, అఖండాల అధిపతులు వస్తున్నారని అన్నారు. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ను కలిసి ఆహ్వానించామని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించబోతున్నామని తెలిపారు. నవంబర్ 3న యజ్ఞ సంకల్పంతో కార్యక్రమం మొదలవుతుందన్నారు. నవంబర్ 4న కార్తీక సోమవారం సందర్భంగా రామేశ్వరం నుంచి తెచ్చిన మట్టితో శివలింగం ఏర్పాటు చేసి పూజ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.