
విజయదశమి సందర్బంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ జీ సందేశంపై విజయవాడలో నిర్వహించిన చర్చలో ఆర్ఎస్ఎస్ కి చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పంచ పరివర్తన్ (పంచప్రాణ)…
1) సామాజిక సద్భావన: సమాజంలో తక్కువ ఎక్కువ బేధం లేదు అందరికీ సమానమైన గౌరవం పొందాలి.గుడిలో భగవంతుడిని అందరూ దర్శించుకోవాలి.
2) పర్యావరణం కాపాడటం: భవిష్యత్ తరాలకు నీటి సంరక్షణ చేసుకుంటూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి ఇంటి పరిసరాలలో పచ్చదనం పెంచాలి.
3) పౌరవిధులను పాటించడం: రాజ్యాంగాన్ని గౌరవిస్తూ… చట్టాన్ని అనుసరించాలి, ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత.
4) కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం: కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు మాట్లాడుకోవాలి,అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి.
5) సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడం: స్త్రీని తల్లిగా భావించే సంస్కృతి మనది,3నుండి 12 సంవత్సరాల వయస్సులో పిల్లలకి సంస్కారం నేర్పే విద్యని మాతృభాషలో అందించాలి.
అశ్వం నైవ గజం నైవ,వ్యాఘ్రం నైవచ నావైచ-అజాపుత్రం బలిమ్ ధైద్యత్,దేవో దుర్బల ఘాతకః
(బలహీనంగా ఉన్నవారే బలవుతారు) దేశము,సమాజం బలంగా ఉండాలి,అప్పుడే గౌరవం లభిస్తుంది.




