News

ప్రార్థనా మందిరం నిర్వాహకుడిపై స్థానికుల ఫిర్యాదు

254views

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని క్రైస్తవ మత బోధకుడిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏకే మల్లవరంలో క్రైస్తవ మత బోధకుడు తన ప్రార్థనా మందిరం చుట్టుపక్కల ఏర్పాటు చేయడంతో పాటు హిందూ మతానికి చెందిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు జనావాసాల మధ్య ఉన్న ప్రార్థనా మందిరంలో తన భార్య మృతదేహాన్ని ఖననం చేయడంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవడంలేదంటూ గ్రామంలో ఆందోళనకు దిగారు. తహసీల్దారు సత్యనారాయణ, సీఐ శ్రీనివాస్‌ ఎస్సై రామకృష్ణ, గ్రామ కార్యదర్శి రాజు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. తొలగించిన ఫ్లెక్సీలను, బల్లలను యథావిధిగా ఏర్పాటు చేయడంతో పాటు శాంతి కమిటీని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడంతో ఆందోళన విరమించారు.