
345views
శబరిమలై యాత్రకు వెళ్లే అయ్యప్పభక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక అద్దె బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టెక్కలి డిపో మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మూడురకాల ప్యాకేజీలతో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఐదురోజుల ప్యాకేజీలో విజయవాడ, ఎరుమేలి, పంబ, అయ్యప్పస్వామి సన్నిధానం, శ్రీపురం, కాణి పాకం, తిరుపతి, అన్నవరం, సింహాచలం మీదుగా టెక్కలి చేరుకుంటుందన్నారు. ఏడు రోజుల ప్యాకేజీలో పై వాటికి అదనంగా మధురై, రామేశ్వరం, 11 రోజుల ప్యాకేజీలో గురు వాయర్, తివేండ్రం, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, కంచి వంటి ప్రదేశాలుంటాయన్నారు. ఇతర వివరాలకు 99592 25611 నెంబ రులో సంప్రదించాలని కోరారు.





