News

దసరా తర్వాత 21 రోజులకు దీపావళి ఎందుకు వస్తుంది.. ట్వీట్ వైరల్

290views

దసరా నవరాత్రులు ముగిశాయి. ఇప్పుడు దీపావళి పండగ సందడి మొదలైంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే దీపావళి పండగ గురించి అనేక పురాణకథలు ఉన్నాయి. శ్రీ రాముడు, రామాయణం గురించి అందరికీ తెలుసు. చిన్నతనం నుంచి శ్రీ రాముడు, రామాయణ కథలు వింటూ పెరిగిన వారు.. అయితే ఇప్పుడు శ్రీరాముడికి సంబంధించిన ఓ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలంక నుంచి అయోధ్యకు శ్రీరాముడు 21 రోజుల పాటు ప్రయాణించాడని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో.. ఇది నిజమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రామాయణం అత్యంత ముఖ్యమైన హిందూ గ్రంథం. చాలా మందికి రామాయణ కథలతో సుపరిచితం. శ్రీరాముడు, రామాయణానికి భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మానవుడిగా పుట్టిన శ్రీరాముడు నడక, నడతతో దైవంగా పూజించిపబడుతున్నాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే దసరా ముగిసి దీపావళి రానున్న నేపధ్యంలో ప్రస్తుతం శ్రీరాముడు శ్రీలంక నుంచి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజుల పాటు ప్రయాణించాడంటూ ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్లేందుకు 21 రోజుల 10 గంటల సమయం పడుతుందని గూగుల్ మ్యాప్ చెబుతోంది. ముకుల్ దేఖానే తన ఖాతాలో చిన్న Google మ్యాప్ స్క్రీన్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోతో ‘దసరా తర్వాత 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటారు? శ్రీరామ చంద్రుడు శ్రీలంక నుంచి అయోధ్యకు వెళ్ళడానికి నడవడానికి 21 రోజులు పట్టింది.. ఇది నిజమేనా? ఇది Google Mapsలో సెర్చ్ చేయగా రిజల్ట్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. లంక నుండి అయోధ్యకు తిరిగి రావడానికి 21 రోజులు పట్టిందని తెలిసి తాను షాక్ తిన్నానని చెప్పాడు.

వైరల్ ఎక్స్ పోస్ట్; దసరా తర్వాత 21 రోజుల తర్వాత దీపావళి ఎందుకు జరుపుకుంటారు.
శ్రీరాముడు సీతా సమేతంగా తన పరివారాన్ని తీసుకుని శ్రీలంక నుండి అయోధ్యకు చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు. ఈ విషయం గురించి Google మ్యాప్స్‌లో తనిఖీ చేయగా.. 504 గంటలను 24 గంటలు గా డివైడ్ చేస్తే సమాధానం 21.00 21 రోజులని అన్సర్ రావడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు.. ఈ విషయాన్నీ ధృవీకరించుకోవడానికి తాను ఉత్సుకతతో గూగుల్ మ్యాప్‌ని సెర్చ్ చేసినట్లు తెలిపారు. శ్రీలంక నుండి అయోధ్యకు కాలినడకన దూరం 3145 కి.మీ .. నడవడానికి తీసుకున్న సమయం 504 గంటలు అని తెలిసింది.. అంటే 21 రోజులు పడుతుందని చూసి నేను ఆశ్చర్యపోయానని తెలిపాడు.