News

గోష్పాద క్షేత్రంలో గోదావరిహారతి

301views

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గోదావరి మహా నీరాజనం, మహా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో సుస్మిత రాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో సుస్మిత రాణి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి కార్యక్రమాన్ని నవంబర్ 4వ తేదీ న నిర్వహించడం జరుగుతుందన్నారు. హారతి ఇచ్చే రోజున ఉత్సవ విగ్రహాలు వస్తాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున సుమారు పదివేల పైబడి హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తారని, ఇందుకు సంబంధించి మత్స్యశాఖ, విద్యుత్, అగ్నిమాపక, ఇరిగేషన్, పోలీస్, దేవాదాయ ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఆయా శాఖలకు కేటాయించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ అధికారి పగడాల ఆనంద తీర్థ ఆచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో  దక్షిణ గంగగా పిలవబడే పవిత్ర గోదావరి నదమ్మ తల్లికి  అందించే ఆత్మీయ హారతి కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.
నవంబర్ 4వ తేదీ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని కొవ్వూరు పట్టణం పవిత్ర గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం నందు నిర్వహించడం జరుగుతుందన్నారు.