News

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

264views

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతపురం జిల్లాలో 17వ తేదీన నిర్వహించే వాల్మీకి జయంతో సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.

వాల్మీకి జయంతిని పండుగగా గుర్తించాలని వాల్మీకీ సామాజిక వర్గం అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. వారి ఆకాంక్షలు నెరవేరడంతో పలు ప్రాంతాల్లో వాల్మీకీ సామాజికవర్గంవారు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.