అందరూ బాగుండాలి అన్న నినాదంతో తిరుపతి జిల్లా కొత్తగూడేనికి చెందిన త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత జి.వీరేంద్రచౌదరి భద్రాచలం నుంచి తిరుమలకు చేపట్టిన పాద యాత్రకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. ఈ మేరకు ఏడో యాత్ర ముగింపు సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ పుష్కర్ కుమరం మెడల్, నమోదు పత్రాలను అందించారు. డాక్టర్ పుష్కర్ కుమరం మాట్లా డుతూ సమాజహితం కోరుతూ ఏడు పర్యాయాలు భద్రాచలం నుంచి తిరుమలకు 19 రోజుల్లో 619 కిలోమీటర్లు స్పీడ్ వాక్ చేయడాన్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కల్పించినట్టు తెలిపారు. వీరేంద్రచౌదరి మాట్లాడుతూ 2004లో తమ పాదయాత్రను భద్రాచలం రామాలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు 11 మందితో చేపట్టి నట్టు తెలిపారు. ఇలా ప్రతి లీపు సంవత్సరంలో యాత్రతో ఏడు సార్లు పాదయాత్రను చేపట్టినట్టు చెప్పారు. మొన్న చేపట్టిన ఏడో పాదయాత్ర ముగింపుతో శ్రీవారిని దర్శించుకుని టీటీడీ నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు.
406views
You Might Also Like
కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణా
13
కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. మరిపెడ పోలీసులు తనిఖీల్లో బయటపడింది. నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీలో...
ప్రతి సోమవారం పంచారామాల యాత్ర
17
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక పుణ్యక్షేత్ర దర్శన ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అందుబాటులోకి తీసుకువస్తోందని ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ (టూర్స్;...
అయ్యప్ప స్వామి విగ్రహం ధ్వంసం..
17
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని శివాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది.ఈ ఘటనతో అయ్యప్ప...
కాశీలో కనువిందు చేస్తున్న ఆకాశదీపాలు..
కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. కాశీ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. సాయంసంధ్య వేళ గంగానది తీరంలోని పంచగంగ ఘాట్‌లో నింగిని తాకేలా వెలిగే ఆకాశదీపాలు భక్తులకు కనులవిందు...
దీపారాధనలో అద్వైత సందేశం
భారతీయ సనాతన ధర్మంలో పండుగలు కేవలం బాహ్య సంబరాలకు పరిమితం కావు. ప్రతి పండుగ వెనుక ఓ ఆధ్యాత్మిక సందేశం, ఓ జీవిత సత్యం, ఓ ధర్మబోధ...
వనవాసుల దీపావళి.. అడవుల్లోనూ వెలుగుల పండుగ సందడి!
అంధకారాన్ని పారద్రోలి వెలుగులను నింపే పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం...





