News

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

304views

అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలకు స్వీడిష్ అకాడమీ నొబెల్ పురష్కారం ప్రకటించింది. దేశాల మధ్య సంపదలో అంతరాల మధ్య వ్యత్యాసాలపై పరిశోధనలకు గాను డారెన్ ఏస్‌మోగ్లు, జేమ్స్ ఎ.రాబిన్‌సన్, సైమన్ జాన్సన్‌లకు ఈ పురష్కారం అందించనున్నారు.

2023లో అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌కు నొబెల్ పురష్కారం లభించింది. తాజాగా ముగ్గురికి నొబెల్ వరించింది. ధనిక దేశాల్లో సంపద పోగుపడటం, కొన్ని నిరుపేద దేశాలుగా మిగిలిపోవడంపై వీరు చేసిన పరిశోధనలకు ఈ పురష్కారం దక్కింది.