News

అయోధ్య రాముడి ధనస్సు ప్రదర్శన

219views

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాసవీ మాతను రూ.3.33 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు. అక్కడే అయోధ్యలో బహూకరించనున్న బంగారం, వెండితో తయారు చేసిన కోదండ రాముడి ధనస్సును మంగళవారం ప్రదర్శించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తదితర అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్‌ అప్పన వీరన్న, సంఘ ప్రతినిధులు వరదా సూరిబాబు, డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి, వంకాయల కాశీ, యెండూరి సీతా మహాలక్ష్మి తదితరులు భక్తులకు సేవలు అందించారు.