ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేసే దిశగా సేవా భారతి ‘‘సేవా సప్తాహం’’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య అవగాహన, రక్తదానం, రక్తపరీక్షలు వంటి వైద్య సేవాలను అందించడం జరిగింది. నంద్యాల నగరం సుంకులమ్మ ఉపనగరం సేవా బస్తి ఆజాద్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యుల నేతృత్వంలో రక్త పరీక్షలు నిర్వహించారు. మందులు అందించారు.
విశాఖపట్నంలో డా. పీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విశాఖ సేవా విభాగ్ ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి 43 మందికి తగు పరీక్షలు నిర్వహించారు. అలాగే సేవా సప్తాహంలో భాగంగా స్థానికంగా ఉన్న దేవాలయాన్ని శుభ్రపరిచారు. విద్యార్థినీవిద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో పాటు వృద్ధులకు పండ్లు, రొట్టెలను అందించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ్ శ్రీ అతుల్ లిమయే, ప్రాంత ప్రచారక్‌లు, విభాగ్ కార్యవాహ్‌లు, సర్‌కార్యవాహ్‌లు, జిల్లా సేవా ప్రముఖ్‌లు, నగర సేవా ప్రముఖ్‌లు, స్వయంసేవకులు పాల్గొన్నారు.
84
You Might Also Like
దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వహిందూపరిషత్ ‘హైందవ శంఖారావం’
కొన్నేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇటీవల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ వంటి వార్తలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. హిందూధర్మానికి ఆయువుపట్టులైన దేవాలయాలే...
కెనడాలో దేవాలయంపై దాడి : హిందువుల భారీ నిరసన ర్యాలీ
5
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూసభ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ అనుకూల శక్తుల దాడులను నిరసిస్తూ హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ఫోబియాను వీడాలంటూ నిరసనలు తెలిపారు. హిందూ...
నేపాల్ లో శునకాల పండుగ
కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉంటుంది. మరి మనిషి దానికి కృతజ్ఞత ప్రకటించే పండుగ చేసుకోవాలి గదా. నేపాలీలకు శునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి...
పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు
ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది....
తారను మాయం చేయనున్న జాబిల్లి
7
అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్ 27న దాదాపు గంటపాటు...
తమ దేశ చరిత్రపై హిందుత్వ ప్రభావం; చైనా పండితుల వెల్లడి
15
చైనాలోని పలు బౌద్ధ గ్రంథాల్లో రామాయణ కథల ఆనవాళ్లు ఉన్నాయని చైనాకు చెందిన పండితులు పేర్కొన్నారు. తమ దేశ చరిత్రపై హిందుత్వ ప్రభావాన్ని తొలిసారి వెలుగులోకి తెచ్చారు....