News

భీమవరంలో అయోధ్య రాముని ధనుస్సు

450views

అయోధ్యలోని రామ మందిరం పైభాగంలో నిర్మాణంలో ఉన్న కోదండ రామాలయంలో స్వామికి అలంకరించే నిమిత్తం తయారు చేయించిన ధనుస్సు, బాణాలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని లెక్చరర్స్‌ వీధిలో ఉన్న పురిఘళ్ల వెంకటరమణమూర్తి నివాసం వద్ద సోమవారం ప్రదర్శించారు. వీటికి అయోధ్య భాగ్యనగర్‌ సీతారామ సేవా ఫౌండేషన్‌ నిర్వాహకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి (హైదరాబాద్‌) ప్రత్యేక పూజలు చేసి భక్తుల దర్శనార్థం ఊయలలో ఉంచారు. ఆయన మాట్లాడుతూ భక్తులు సమకూర్చిన 13 కిలోల వెండి, కిలో బంగారంతో వీటిని తయారు చేయించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వీటిని ప్రదర్శిస్తామన్నారు.