News

భగవద్గీత మోక్ష ప్రదాయిని

449views

భగవద్గీత మోక్ష ప్రదాయిని అని, ప్రతిఒక్కరూ భగవద్గీత చదవాలని పాలకొండకు చెందిన ఆధ్యాత్మిక వక్త ఎన్వీ రమణ అన్నారు.విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని దేవుదల గీతామందిరంలో గొర్లె దామోదరరావు ఆధ్వర్యంలో దివ్య జీవన సత్సంగ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భగవద్గీతను పఠిస్తే చెడుగీతలు చెరిగిపోతాయన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ పని ఒత్తిడిలో పడి మానసిక ప్రశాంతత కోల్పోతున్నారని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు.మోక్ష యోగ్యతాభరితమైన జ్ఞాన సిద్ధిని పొందాలంటూ భగవద్గీత తెలుపుతుందని చెప్పారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మోహన్‌దాస్‌, అప్పలరాం, నిత్య స్మరణానందస్వామి, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.