News

వందలో ఒక్కటి మన “స్టాట్యూ ఆఫ్ యూనిటీ”

565views

గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ 100గొప్ప ప్రదేశాల్లో చోటు దక్కించుకుంది. ప్రముఖ టైమ్స్‌ మ్యాగజైన్‌ 2019కి గాను ప్రపంచంలోనే 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అందులో గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ”స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ప్రపంచంలోనే 100గొప్ప ప్రదేశాల్లో చోటు దర్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని రోజులక్రితం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ని ఒక్క రోజులోనే 31వేల మంది సందర్శించారు.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు కృషి చేసిన మహానుభావుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మించిన స్మారక కట్టడమే ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్‌లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. ఈ విగ్రహం 182మీటర్ల ఎత్తు ఉంది. గత సంవత్సరం అక్టోబర్‌ 31న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జన్మదినం సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.